![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద అమరదీప్ -తేజస్విని ఒక మంచి జోడిగా అందరికీ తెలుసు. రీసెంట్ గా అమరదీప్ కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి లవ్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. అందులో అమరదీప్ తన హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ చెప్పాడు. "దగ్గరుండి అప్లికేషన్ ఫిల్లప్ చేయించి బస్ ఎక్కించి పంపించిన అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. అది మన కళ్ళతో చూస్తే మనకు ఎలా ఉంటుంది. ఎప్పుడూ వచ్చే అమ్మాయి ఆ బస్సులోంచి దిగుతుంది కదా అని ఎదురు చూసే టైములో వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి హగ్ చేసుకున్నాడు. నా కళ్ళ ముందు నేను అది చూసాను." అని తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పాడు. "జానకి కలగనలేదు" అనే సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరయ్యాడు అమరదీప్. రామ పేరుతో మంచి పేరు సంపాదించుకున్నాడు అమర్ దీప్ చౌదరి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో అమరదీప్ బాగా గేమ్స్ ఆడాడు అలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. అలాగే అరియానా, సొహైల్, అషు రెడ్డి, అవినాష్ వీళ్లంతా అమర్ దీప్‌కి మంచి ఫ్రెండ్స్ కూడా. రీసెంట్ గా అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ కూడా ఇష్మార్ట్ జోడికి కూడా వెళ్లారు. అలాంటి అమరదీప్ ఐరావతం, రాజు గారి కిడ్నాప్ అనే మూవీస్ లో నటించాడు. ఇక ఇప్పుడు "సుమతి శతకం" అనే మూవీలో నటిస్తున్నాడు. అమర్ దీప్ చౌదరి సరసన సాయిలీ చౌదరి హీరోయిన్ గా చేస్తోంది.
![]() |
![]() |